బీఆర్‌ఎస్‌ను వీడుతున్న ఎమ్మెల్యేలు.. కేటీఆర్‌ రియాక్షన్‌ ఇదే.. | KTR Serious Comments Over MLAs Party Change In Telangana | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ను వీడుతున్న ఎమ్మెల్యేలు.. కేటీఆర్‌ రియాక్షన్‌ ఇదే..

Published Mon, Jun 24 2024 8:46 AM | Last Updated on Mon, Jun 24 2024 9:13 AM

KTR Serious Comments Over Party Changed MLAs In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొందరు ప్రతిపక్ష నేతలు అధికారం పార్టీలో చేరుతున్న నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. గతంలో 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎదుర్కొన్నాం. ఆనాడు దీనిపై తెలంగాణ ప్రజలు ఆందోళనను ఉధృతం చేయడం ద్వారా రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదురయ్యాయి. చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. మళ్లీ చరిత్ర పునరావృతమవుతుంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

 

అయితే, తాజాగా తెలంగాణలో పలువురు సీనియర్‌ నేతలు అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కేసీఆర్‌కు సన్నిహితులుగా పేరొందిన మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పలువురు నేతలు హస్తం పార్టీలో చేరారు. అంతకుముందు కూడా పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ కాంగ్రెస్‌ గూటికి వెళ్లారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement