
హైదరాబాద్: తనపై పెట్టిన ఫార్మాలా ఈ-కార్ రేసు ఒక లొట్టపీస్ కేసని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు ఆనాడు ఈ-కార్ రేస్ నిర్వహించామన్నారు. లొట్టపీస్ కేసులో ఎటువంటి చార్జ్‌షీటైనా వేసుకోమనండి, అందులో అవినీతే జరగలేదన్నారు. ఈరోజు(మంగళవారం, పెప్టెంబర్ 9వ తేదీ) ఫార్మాలా ఈ-కార్ రేస్ చార్జ్‌షీటు దాఖలుపై కేటీఆర్ స్పందించారు.
‘ ఫార్ములా ఈ కార్ రేస్ లో అవినీతే జరగలేదు. ేను లైట్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం , రేవంత్ రెడ్డి సిద్ధమా?, దమ్ముంటే రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలి. రేవంత్ వస్తారా.. ఏసీబీ డీజీ వస్తారా.. లై డిటెక్టర్ సిద్ధం. ూ. 45 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశించింది నేనే. ఎక్కడా కూడా రూపాయి తారుమారు కాలేదు. ప్రాసిక్యూషన్, చార్జిషీట్, జైలు.. ఏదైనా చేసుకోండి.. నేను సిద్ధం’ అని కేటీఆర్ సవాల్ చేశారు.
కాగా, అంతకుముందు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కేటీఆర్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ‘కొందరు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేదని దుస్థితిలో ఉన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ మీటింగ్‌లకు ఎందుకు రావడం లేదు?.కాంగ్రెస్ కండువా వేసుకుని సిగ్గులేకుండా బీఆర్‌ఎస్‌లో ఉన్నానంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటువేయాలి’అని డిమాండ్ చేశారు.