సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ని కేసీఆర్ బీజేపీకి తాకట్టుపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది. ప్రధాని మోదీకి ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరం. కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్టే.కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలైంది.
ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. సోనియా,రాహుల్‌ను ఈడీ విచారించింది. కేసీఆర్,కేటీఆర్,హరీష్‌ను ఎందుకు పిలవలేదు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనమయ్యే పరిస్థితి ఉంది’అని పునరుద్ఘాటించారు.


