డైవర్షన్‌ పాలిటిక్స్‌ తెలంగాణలో పనిచేయవు.. కాంగ్రెస్‌పై హరీష్‌ ఫైర్‌ | BRS Harish Rao Serious Comments On Congress Govt Over Diversion Politics, More Details Inside | Sakshi
Sakshi News home page

డైవర్షన్‌ పాలిటిక్స్‌ తెలంగాణలో పనిచేయవు.. కాంగ్రెస్‌పై హరీష్‌ ఫైర్‌

Oct 28 2024 2:24 PM | Updated on Oct 28 2024 3:10 PM

BRS Harish Rao Serious Comments On Congress

సాక్షి, తెలంగాణ భవన్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ నేతలను టార్గెట్‌ చేశారని ఆరోపించారు మాజీమంత్రి హారీష్‌ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడుస్తోందన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘నిరుద్యోగులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ఏమైంది?. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా?. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందర్నీ మోసం చేశారు.  కనీసం 20వేల ఉద్యోగాలకు అయినా నోటిఫికేషన్‌ ఇచ్చారా?. కాంగ్రెస్‌ పాలన పట్ల ఏ వర్గం ఆనందంగా లేదు. రేవంత్‌ రెడ్డి విద్యార్థులను కూడా మోసం చేశారు. ఇప్పటి వరకు విద్యార్థులకు ఫీజురియింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు.

రాష్ట్రంలో రైతులు తక్కువ ధరకు పంట అమ్ముకుంటున్నారు. బోనస్‌ కాదు కదా మద్దతు ధర కూడా దక్కడం లేదు. పత్తి, మొక్కజొన్న రైతులు కూడా నష్టపోతున్నారు. 317 జీవో పరిష్కరించలేదు. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది. కాంగ్రెస్‌ డైవర్షన్‌ రాజకీయాలు తెలంగాణలో పనిచేయవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement