‘రోలెక్స్‌ వాచీలు, బెంజ్‌ కార్లు.. వీళ్లా రైతులు.. యాత్ర అంటే ఇదేనా..’

AP Minister Merugu Nagarjuna Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: దళితులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్‌.. బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలతో పాలన చేస్తున్నారన్నారు. 2023 ఏప్రిల్‌ నాటికి అంబేద్కర్‌ విగ్రహం పూర్తి చేస్తామన్నారు. బలహీన వర్గాలకు సీఎం జగన్‌  అండగా నిలిచారన్నారు.
చదవండి: దమ్ముంటే అసెంబ్లీకి రా.. చంద్రబాబుకు పార్థసారథి సవాల్‌

చంద్రబాబు ఏరోజైనా దళితులను పట్టించుకున్నారా?. అమరావతి పేరుతో రాజకీయ యాత్ర చేస్తున్నారు. అమరావతి యాత్రలో ఉన్నది రైతులు కాదు. రోలెక్స్‌ వాచీలు, బెంజ్‌ కార్లు ఉన్న వారే యాత్ర చేస్తున్నారు. అమరావతి రాజధానిగా ఉండదని సీఎం చెప్పారా?. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష. సీఎం జగన్‌ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు చంద్రబాబుకు అవసరం లేదు. ఆయనకు నిబద్ధత ఉంటే అసెంబ్లీకి రావాలి. నీ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం. సీఎం జగన్‌ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుపడుతున్నావు’’ అంటూ చంద్రబాబుపై మంత్రి విరుచుకుపడ్డారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top