కరీంనగర్: హైదరాబాద్‌లోని లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌లో ఉద్యోగాల భర్తీకి ఈ నెల 6న కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు శనివారం ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. అప్రెంటిస్‌షిప్, క్యాషియర్, సేల్స్ అసోసియేట్, హెల్పర్ తదితర విభాగాల్లో మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనుండగా, రూ.16వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం అందించనున్నారు. 18 నుంచి 30ఏళ్ల వయస్సు గల అర్హులైన సీ్త్ర, పురుషులు తమ బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్లతో సోమవారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి తెలిపారు. ఎంపికై న నాన్ లోకల్ అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారని తెలిపారు.
ఆర్మీ మద్యం పట్టివేత
పెద్దపల్లి: గాంధీ జయంతి సందర్భంగా అమలులో ఉన్న డ్రైడే సమయంలో పెద్దపల్లి మండలం పెద్దకల్వలలో అక్రమంగా డిఫెన్స్ (ఆర్మీ) మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారం తనిఖీ చేసిన అధికారులు 750 ఎం.ఎల్. సామర్థ్యం కలిగిన 29 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డీటీఎఫ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్, ఎకై ్సజ్ ఎస్‌ఐ దామోదర్‌శెట్టి తెలిపారు. తనిఖీల్లో హెడ్‌కానిస్టేబుళ్లు సందీప్, తిరుపతి, కానిస్టేబుళ్లు డి.సురేశ్, బి.నవీన్, పి.నాగరాజు పాల్గొన్నారు.
గాంధీ జయంతి రోజే పేకాట జోరు
పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్‌లో గాంధీజయంతి(ఈనెల 2న) రోజు రాత్రి 10.30 గంటల సమయంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. అధికార పార్టీ సర్పంచ్‌తోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.28,120 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు సెట్ల పేకముక్కలు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్ రమేశ్ ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ జకీర్ హుస్సేన్ దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయస్థాయి అవార్డు
వీణవంక: సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించిన ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్‌లో హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన లక్కాకుల శ్రీనివాస్ జాతీయస్థాయి వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్‌ఏపీ ఫౌండర్ ఎంసీ శేఖర్ చేతుల మీదుగా ఎస్‌ఏపీహెచ్‌ఎం రిబ్బన్ అవార్డుతోపాటు రూ.వెయ్యి నగదు పురస్కారాన్ని అందుకొని సత్తా చాటారు. 16 ఏళ్లుగా ఫొటోగ్రఫీ రంగంలో ఉన్న శ్రీనివాస్ మండలస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎదగడంపై గ్రామస్తులు, మండల అధ్యక్షులు సంగెం మోహన్ అభినందించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. జాతీయస్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.


