వేములవాడ: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు రెండో రోజు శనివారం హోరాహోరీగా జరిగాయి. లీగ్ మ్యాచ్ల ఫలితాలను నిర్వాహకులు విడుదల చేశారు. బాలుర, బాలికల విభాగాల్లో లీగ్ దశ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా జరిగాయి. క్రీడాకారులను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పరిచయం చేసుకున్నారు. సాయంత్రం జరిగిన పోటీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ తిలకించారు. మిగిలిన లీగ్ మ్యాచ్లు, నాకౌట్ రౌండ్లు ఆదివారం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నేడు క్యాంప్ ఫైర్
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో క్యాంప్ఫైర్, ధూం..ధాం, ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.


