ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్ల చోరీ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్ల చోరీ

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

● ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

● ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

కరీంనగర్‌ టౌన్‌: ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లోని బద్ధం ఎల్లారెడ్డిభవన్‌లో శనివారం మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అక్రమాలను అడ్డుకునేందుకు విద్యార్థులు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది పేర్లను తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారు, మత రాజకీయాలను వ్యతిరేకించే ప్రజలు, జెన్‌జీ యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అవకతవకలకు బాధ్యత వహించి జాతీయ ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ప్రైవేట్‌ విద్యాసంస్థల కార్యక్రమాలకు హాజరవుతున్నారని, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు మాత్రం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలను బీజేపీ ప్రోత్సహిస్తోందని, తెలంగాణ విద్యార్థులు, యువత కోసం కేంద్ర ప్రభుత్వం చేసినదేమిటో కేంద్ర మంత్రి అమిత్‌షా చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నుంచి కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ గుడికి, బడికి తగిన నిధులు తీసుకురాలేదని విమర్శించారు. నీట్‌ పరీక్ష నిర్వహణను రాష్ట్రాలకే అప్పగించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నప్పటికీ విద్యార్థుల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మచ్చ రమేశ్‌, రేణికుంట్ల ప్రీతం, మంద అనిల్‌, కుర్ర రాకేశ్‌, సాయి ఆజాద్‌, మామిడిపల్లి హేమంత్‌, కనకం సాగర్‌, సామ వినయ్‌రెడ్డి, కసిరెడ్డి సందీప్‌రెడ్డి, అనోష్‌, బోయిని విష్ణు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement