ఈహెచ్‌ఎస్‌ ఉద్యోగులకు వరప్రదాయిని | - | Sakshi
Sakshi News home page

ఈహెచ్‌ఎస్‌ ఉద్యోగులకు వరప్రదాయిని

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

● ఎంప్లాయీస్‌ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌

● ఎంప్లాయీస్‌ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌

కరీంనగర్‌ అర్బన్‌: ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌) ఉద్యోగులకు వరప్రదాయినని ఎంప్లాయిస్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ అన్నారు. శనివారం జిల్లా చైర్మన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి నగరంలోని పలు ఆసుపత్రులను సందర్శించారు. ఈహెచ్‌ఎస్‌ అమలు తీరు, ఉద్యోగులకు అందుతున్న వైద్య సేవలు, చికిత్సా సమయంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సన్‌రైజ్‌ ఆస్పత్రిలో నిర్వహించిన శ్రీమీట్‌– గ్రీట్‌శ్రీ కార్యక్రమంలో పాల్గొని, ఉద్యోగులకు స్కీమ్‌ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి కాళీచరణ్‌ గౌడ్‌, సంఘం నాయకులు నాగేందర్‌ రెడ్డి, అమరేందర్‌రెడ్డి, సర్దార్‌ హర్మిందర్‌ సింగ్‌, రాగి శ్రీనివాస్‌, ఆకుల సతీష్‌, మారుపాక రాజేష్‌ భరద్వాజ్‌, రమేష్‌ గౌడ్‌, వెలిచాల సుమంత్‌ రావు, అస్గర్‌ అలీ, శంకర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement