ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేయాలి

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

గోదావరిఖని: రోడ్డు ప్రమాదాల నియంత్రణతోపాటు ప్రజలకు సురక్షిత ప్రయా ణం కల్పించడమే లక్ష్యంగా రోడ్డు భద్రత నిబంధనలను కఠినంగా అమలు చేయా లని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా ఆదేశించారు. కమిషనరేట్‌లో ట్రా ఫిక్‌ పోలీసు అధికారులతో శనివారం ట్రాఫిక్‌ నిబంధనలపై సమీక్షించారు. రోడ్లపై భారీ వాహనాలను ఇష్టారాజ్యంగా నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ నియంత్రణకు ని ఘా ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించేవారి పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆటోలు, స్కూల్‌ వ్యాన్లు, బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించకుండా తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మైనర్ల డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌ తదితర ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు డీసీపీ (అడ్మిన్‌) కె.శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ట్రాఫిక్‌ సీఐలు రాజేశ్వరరావు, శ్రీనివాస్‌, హనన్‌, సీసీఆర్‌బీ సీఐ అనిల్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐలు పాల్గొన్నారు.

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement