నాలుగు నెలలైనా తట్టెడు మట్టి తీయలే | - | Sakshi
Sakshi News home page

నాలుగు నెలలైనా తట్టెడు మట్టి తీయలే

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

మంథని: నాలుగు నెలల క్రితం కూల్చివేసిన మార్కెట్‌ యార్డు నుంచి ఇప్పటికీ ఒక్క తట్టెడు మట్టికూడా తీయలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. కమీషన్‌ రాకనా, వచ్చినా ఎన్నికల వరకు ఆగాలనా? పనులు ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదని ఆయన నిలదీశారు. పట్టణంలో నిర్మిస్తున్న వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ను శనివారం ఆయన పరిశీలించారు. మున్సిపల్‌ కమిషనర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈతో ఫోన్‌ మాట్లాడి మార్కెట్‌ నిర్మాణంలో జాప్యంపై వివ రాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అనాలోచిత నిర్ణయాలతో మార్కెట్‌ ఆనవాళ్లు లేకుండా దుద్దిళ్ల శ్రీధర్‌ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తాయని, అప్పటిలోగా మార్కెట్‌ పూర్తికావాలని పుట్ట మధు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement