పెద్దపల్లి: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అప్పన్నపేటలో కొనసాగుతున్న బైపాస్ రోడ్డు, రాఘవపూర్‌లో ఇందిరా మ హిళా శక్తి భవనం, పెద్దపల్లి ఆర్టీసీ బస్సు డిపో, కూ నారం రైల్వే ఫ్లైఓవర్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. బస్సు డిపోలో ప్రయాణికులు, సి బ్బందికి వసతులు కల్పించాలని సూచించారు. రైల్వే ఫ్లైఓవర్ పనుల్లో మరింత వేగం పెంచా లని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య, డీఈ రమణారెడ్డి, ఏఈ రాజ్‌కుమార్, ఈఈ పీఆర్ శంకరయ్య, గోదావరిఖని డిపో మేనేజర్ కవిత, రైల్వే జేఈ జానకీరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌సింగ్, తహసీల్దార్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


