తెలంగాణ పల్లెల్లోని మట్టికి మహత్యం ఉంది. ఒకప్పుడు ఉనికి కోసం పోరాడిన యువత.. నేడు క్రీడాకీర్తిని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడిస్తున్నారు. మారుమూల పల్లెల్లో పుట్టి.. వసతులు లేమితో సతమతమైనా.. కొండంత మనోనిబ్బరం.. సాధించాలనే కసితో అవకాశాలను అందిపుచ్చుకుంటూ క్రీడాచరిత్రలో తమ పేరును పదిలం చేసుకుంటున్నారు. పల్లెటూరి పిల్లబాటలో పడ్డ అడుగులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పరుగు పెడుతున్నాయి. అథ్లెటిక్స్.. ఫుట్‌బాల్.. కబడ్డీ.. ఆట ఏదైనా పతకం మాదే అంటూ పట్టుబిగిస్తున్నారు.
– సాక్షి, పెద్దపల్లి/వేములవాడ


