న్యూస్‌రీల్
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌కు చెందిన 17 ఏళ్ల ఆనందిని అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతోంది. జాతీయస్థాయిలో పతకం సాధించి.. అంతర్జాతీయ వేదికే లక్ష్యంగా పరుగులు పెడుతోంది. ఆనందిని తండ్రి శంకర్ వాలీబాల్ ప్లేయర్ కావడంతో తండ్రి స్ఫూర్తితో క్రీడలపై ఆసక్తి పెరిగింది. తండ్రితో కలిసి వాకింగ్‌కు వెళ్లడం ద్వారా మొదలైన ప్రయాణం అథ్లెటిక్స్ ట్రాక్ వరకు చేరింది. ఆదిలాబాద్ స్పోర్ట్స్ పాఠశాలలో చదువుకుంటూ ప్రత్యేక శిక్షణ పొందిన ఆనందిని.. అండర్–14, అండర్–16 విభాగాల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించింది. ఒడిశాలో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్‌లో కాంస్యం సాధించింది. గుంటూరులో జరిగిన దక్షిణ భారతస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది.


