చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

సుల్తానాబాద్‌ రూరల్‌: చట్టాలపై ప్రతీఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మున్సిఫ్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేశ్‌ అన్నారు. కాట్నపల్లిలోని రైతువేదికలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మా ట్లాడారు. పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వారి కి ఉచిత న్యాయ సహాయం అందించాలనే ఉద్దేశంతోనే న్యాయసేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయని, అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియో గం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సు ల్తానాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ర వీందర్‌, సర్పంచ్‌ ఓగుల పూజా, మార్కెట్‌ క మిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నార మనోహర్‌, న్యాయవాదులు పెగడ శ్యామ్‌సుందర్‌, సామ ల రాజేంద్ర ప్రసాద్‌, గుడ్ల వెంకటేశ్‌, ఆకారపు రామకృష్ణారెడ్డి, ఉపసర్పంచ్‌ దాసరి రాయమ ల్లు, మండల వ్యవసాయాధికారి పైడితల్లి, ఏ ఈవోలు రాజు, ప్రశాంత్‌, అనూష, పద్మ, రవితేజ, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

సొంతింటి కల నెరవేర్చుతాం

గోదావరిఖనిటౌన్‌: ఆర్టీసీ కార్మికుల సొంతింటి కల నెరవేరాలంటే టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూ యూ, ఎస్‌డబ్ల్యూయూఎఫ్‌ బలరిచిన బాణం గుర్తుకు ఓటువేసి గెలిపించాలని సీఐటీయూ రాష్ట్ర నేత తుమ్మల రాజిరెడ్డి అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో ఆవరణలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల కుమారస్వామి, జి.రమేశ్‌, మహేందర్‌, గొట్టె తిరుపతి, జీఆర్‌ ప్రసాద్‌, కేకే రెడ్డి, పోగుల రంగయ్య, ముస్తాక్‌, మైనొద్దీన్‌, ఏకే స్వామి, ప్రభాకర్‌, కె.రమేశ్‌, కె.శ్రీనివాస్‌, ఎన్‌.శ్రీనివాస్‌, బి.రమేశ్‌, అంజి, మహేందర్‌, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.

వన్యప్రాణులను రక్షించాలి

పెద్దపల్లి: వన్యప్రాణుల సంరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సతీశ్‌కుమా ర్‌ అన్నారు. పెద్దపల్లి, మంథని రేంజ్‌ అటవీ సిబ్బంది, పెద్దపల్లి పోలీసులతో కలిసి కుర్మపల్లిలో శనివారం కార్డన్‌ సెర్చ్‌, రైడ్‌ నిర్వహించారు. వేటకు ఉపయోగించే వలలు, క్లచ్‌వైర్లు, జాలీలు, ఉచ్చులు, కత్తులు, ఇనుప కేజ్‌లు, నైలాన్‌ తాళ్లు, బైండింగ్‌ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి వారోత్సవాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అడవుల్లో చె ట్లు నరకడం, వన్యప్రాణులను వేటాడడం నే రమని సతీశ్‌కుమార్‌ తెలిపారు. మంథని ఎఫ్‌ఆర్‌వో వినయ్‌నాయక్‌, డీఆర్‌వోలు దేవదాస్‌, రమేశ్‌, తిరుపతి, కొమురయ్య, సెక్షన్‌ అధికారు లు రహమతుల్లా, నర్సయ్య, మంగీలాల్‌, అ మిరోద్దీన్‌, రవి, ముదస్సర్‌షా, బీట్‌ అధికారు లు రామ్మూర్తి, మెగరాజ్‌, పవన్‌, ప్రదీప్‌, తిరుపతి, మాధురి, రంజిత్‌, శ్రీకాంత్‌, అక్తర్‌ పాషా, రామ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

అబ్బాపూర్‌లో మద్యపాన నిషేధం

జూలపల్లి: అబ్బాపూర్‌ గ్రామంలో మద్యపానం నిషేధిస్తున్నామని గ్రామపంచాయతీ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. సర్పంచ్‌ దండె వెంకటేశ్వర్లు అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో పాలకవర్గం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమేకాక అర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొ ంటున్నారని, కుటుంబాల్లో గొడవలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది. యువకులు మ ద్యం బారిన పడకుండా ముందస్తు చర్యలు తీ సుకోవడం కోసం సభ్యులు తమ అభిప్రాయాలను వివరించారు. ఈనెల 10వ తేదీ నుంచి మద్యం అమ్మకాలను నిలిపివేయాలని బెల్ట్‌షాపుల నిర్వాహకులకు సమాచారం ఇవ్వాలని తీర్మానించారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్‌ మమత, వార్డు సభ్యుడు శంకర్‌ పాల్గొన్నారు.

లఘుచిత్రం విడుదల

గోదావరిఖనిటౌన్‌: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో శనివారం ‘తిరగబడ్డ మమకారం’ సందేశాత్మక లఘు చిత్రాన్ని పెద్దపల్లి డీసీపీ రాంరె డ్డి, గోదావరిఖని ఏసీపీ రమేశ్‌ విడుదల చేశా రు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆ స్తులను అనుభవిస్తూ వారిని వృద్ధాశ్రమాలకు పంపుతున్న పిల్లలకు ఈ చిత్రం ఒక గుణపాఠంగా నిలుస్తుందని వక్తలు అభిప్రాయపడ్డా రు. దర్శకుడు, చంద్రపాల్‌, నటీనటులు మేజక్‌రాజా, రజితను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement