రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలు | - | Sakshi
Sakshi News home page

రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలు

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

సుల్తానాబాద్‌ రూరల్‌: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా చేపట్టిన రూ.5 లక్షల వడ్డీలేని రుణాలను రూ.10లక్షలకు పెంచామని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. భూపతిపూర్‌లో స్వశక్తి మహిళా సంఘం సుమారు రూ.1.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన చైతన్య జ్యోతి పెట్రోల్‌ బంక్‌ను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అధికారులతో కలిసి విప్‌ శని వారం ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మహిళా సంఘాలు ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని ఆయన సూచించారు. సూపర్‌ ఎల్‌నినో ప్రభావం ఉన్నా.. జిల్లాలో ఆశించినస్థాయిలో వర్షపాతం నమోదైందని, అయినా, గతంతో పోల్చితే నీటి లభ్యత తక్కువగా ఉందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు వచ్చే యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌, కూరగాయలు, మొక్కజొన్న తది తర పంటలు సాగు చేయాలని విప్‌ కోరారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, వీహబ్‌, పెట్రోల్‌ పంపు ఏర్పాటు, కుట్టుశిక్షణ, ఆర్టీసీ బస్సుల నిర్వహణ తదితర రంగాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మూడేళ్లుగా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, స్వశక్తి సంఘాల ద్వారా సుమా రు రూ.33 కోట్ల మేరకు వడ్డీ రాయితీ ప్రయోజనం అందించామని తెలిపారు. ఒంటరి మహిళలు ఆయిల్‌పామ్‌ సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పా రు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కొత్తమార్గాల ను సూచిస్తే ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నా మ ని వెల్లడించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, డీఆర్డీవో కాళిందిని, అడిషనల్‌ డీఆర్డీవో రవీందర్‌, తహసీల్దార్‌ బషీరుద్దీన్‌, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

రైతులు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

భూపతిపూర్‌లో స్వశక్తి సంఘ పెట్రోల్‌ బంక్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement