పెద్దపల్లి: బీసీల సంక్షేమం, చేతివృత్తుల అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని, కాంగ్రెస్ సర్కార్ హామీల అమలులోనే విఫలమైందని బీసీ నాయకులు విమర్శించారు. మాజీ ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో గీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, ఉస్మానియా జేఏసీ మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ తదితరులు హాజరై మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్, 42 శాతం రిజర్వేషన్ హామీ ఏమైందని నిలదీశారు. ఏటా రూ.20 వేల కోట్ల బడ్జెట్ కే టాయింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నిరా కేఫ్ ఏడాదిగా మూతపడినా పట్టించుకోవడం లేదని, దీనిపై మంత్రి పొన్నం ప్ర భాకర్ సమాధానం చెప్పాలన్నారు. మూడేళ్లు గడుస్తున్నా రెండు మంత్రి పదవులను ఎందుకు భర్తీ చే యడం లేదని ప్రశ్నించారు. సచివాలయంలో 30 శాతం కమీషన్ల వ్యవహారం నడుస్తోందంటూ ఆరోపించారు. కడుపు గట్టుకొని పనిచేస్తామన్న మంత్రు లు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. బీసీల సమస్య ల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని కో రారు. జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ ర ఘువీర్‌సింగ్, ఆకుల స్వామి వివేక్ పటేల్, సత్తన్న, ఉప్పు రాజ్‌కుమార్, శ్రీధర్, చంద్రశేఖర్, వెంకట్‌రె డ్డి, సందీప్‌రావు, అంజయ్యగౌడ్, శ్యామ్, ముత్యం సునీత, గుణపతి, సతీశ్, మోహన్‌రావు ఉన్నారు.
42శాతం రిజర్వేషన్ ఏమైంది?
కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ?
మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పాలి
బీసీ సంఘాల నాయకుల ప్రశ్న


