పెరిగిన పీఎల్‌ఆర్‌ బోనస్‌ | - | Sakshi
Sakshi News home page

పెరిగిన పీఎల్‌ఆర్‌ బోనస్‌

Oct 4 2026 8:08 AM | Updated on Oct 4 2026 8:08 AM

గోదావరిఖని: దేశంలోని బొగ్గుగని కార్మికులకు పెర్ఫార్మెన్స్‌ లింక్‌డ్‌ రివార్డు(పీఎల్‌ఆర్‌)బోనస్‌ ఖ రారైంది. బోనస్‌పై జాతీయ కార్మిక సంఘాల నే తలు కోలిండియా యాజమాన్యం శనివారం స మావేశమయ్యాయి. దీపావళికి ముందే అందించే బోనస్‌ను సింగరేణి కార్మికులు దీపావళి బోనస్‌ గా వ్యవహరిస్తారు. గతేడాది రూ.1,03లక్షల వర కు రాగా, ఈసారి రూ.1,10,250కు అందనుంది. సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 38వేల మంది కి కొత్త బోనస్‌ వర్తించనుంది. చెల్లింపుల తేదీని సింగరేణి యాజమాన్యం త్వరలోనే ఖరారు చేయనుంది. కోలిండియాలోని కార్మికులకు దసరాకే చెల్లిస్తారు. కోలిండియాలోని బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.

2014 నుంచి పెరిగిన దీపావళి (పీఎల్‌ఆర్‌) బోనస్‌(రూ.లలో)

ఏడాది పెరిగింది చెల్లింపు

2014 5,000 40,000

2015 8,500 48,500

2016 5,500 54,000

2017 3,000 57,000

2018 3,500 60,500

2019 4,200 64,700

2020 3,800 68,500

2021 4,000 72,500

2022 4,000 76,500

2023 8,500 85,000

2024 8,750 93,750

2025 9,250 1,03,000

2026 7,250 1,10,250

గతేడాది రూ.1.03లక్షలు.. తాజాగా రూ.1.10 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement