ట్రాన్స్‌కో కార్యాలయాన్ని ముట్టడిస్తాం | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో కార్యాలయాన్ని ముట్టడిస్తాం

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

గోదావరిఖని: సింగరేణికి రావాల్సిన బకాయిల కో సం ట్రాన్స్‌కో, జెన్‌కో కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించినట్లు ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. శుక్రవారం ఆ ర్జీ–2 ఏరియా కమ్యూనిటీ హాల్‌లో ఏఐటీయూసీ ఆ ఫీస్‌బేరర్ల సమావేశం నిర్వహించారు. కార్మికుల స మస్యల పరిష్కారం కోసం చేసే పోరాటాలపై తీ ర్మానం చేశారు. లాభాల వాటా, దీపావళి బోనస్‌, తమ యూనియన్‌చే ఒప్పందంపై చర్చించారు. రూ.60 కోట్లు బకాయిలు రాబట్టేందుకు ట్రాన్స్‌కో కార్యాలయం ముట్టడి, సీఎంపీఎఫ్‌ సమస్యలపై కార్యాలయం ఎదుట ధర్నా, ఒప్పందం చేసిన సమస్యలపై వెంటనే సర్క్యులర్‌ జారీచేయాలని, యూనియన్‌పై చేసే దుష్ప్రచారాలను ఎండగట్టాలని తీర్మానించారు. యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్‌, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీలు మడ్డి ఎల్లాగౌడ్‌, ముష్కె సమ్మయ్య, వీరభద్రయ్య, కేంద్ర కార్యదర్శులు కందుకూరి రాజరత్నం, వీరస్వామి, వంగ వెంకట్‌, కవంపల్లి స్వామి, రాజగోపాల్‌, అక్బర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement