జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజె క్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. 1988లో ఇక్కడే ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. వివిధ ప్రా జెక్టుల్లోనూ ఉన్నత హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈడీ స్థాయికి ఎదిగారు. ఈ సందర్భంగా పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని పార్కులో చందన్‌కుమార్ సామంత, రాఖీ సామంత మొక్కలు నాటారు. కాకతీయ ఆడిటోరియంలో ఉద్యోగ విరమణ సన్మానంలో ఉన్నతాధికారులు, అధి కారులు, ఉద్యోగులు, సహచరులు ఆయన సే వలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో పలు యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
రామగుండం హెడ్‌గా ఫైజ్ తయాబ్
రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు హెడ్‌గా ఫైజ్ తయాబ్‌ను నియమిస్తూ కార్పొరేట్ సెంటర్ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఫైజ్ తయాబ్ ధర్పల్లి ఎన్టీపీసీలో విధులు నిర్వర్తిస్తున్నారు.


