రోజుకు రూ.కోటి చొప్పున మంజూరు | - | Sakshi
Sakshi News home page

రోజుకు రూ.కోటి చొప్పున మంజూరు

Oct 2 2026 7:20 AM | Updated on Oct 2 2026 7:20 AM

జిల్లాలో ముఖ్యమంత్రి మొదటి అడుగు పడిందని, రెండో అడుగు సిద్దిపేటలో, మూడో అడుగు గజ్వేల్‌లో పడుతుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా పరిధిలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. వెయ్యి రోజుల్లో రోజుకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేశారన్నారు. మల్కపేట రిజర్వాయర్‌ కాలువ భూసేకరణ పనులకు, వేములవాడ ఆలయానికి గత పాలకులు ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పారని, నేటి ప్రభుత్వం రూ.250 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. గతేడాది 6.90 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్‌ ఇచ్చి నేతన్నలకు చేతినిండా పని కల్పించామన్నారు. ముంపు నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న రూ.35కోట్లను సీఎం విడుదల చేశారని తెలిపారు. 4,600 కుటుంబాలకు పైగా రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందని, మరో 6వేల కుటుంబాల వరకు వేచి చూస్తున్నారని, వారికి కూడా త్వరలోనే నిధులు మంజూరు చేస్తారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు 9, 10, 11, 12 కాలువల నిర్మాణానికి భూసేకరణ నిధులు మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement