పెద్దపల్లి: వృద్ధుల సమస్యలకు ప్రాధాన్యం ఇ చ్చి పరిష్కరించేలా పోలీస్ అధికారులను ఆదేశిస్తామని డీసీపీ రాంరెడ్డి అన్నారు. కలెక్టరేట్ లో గురువారం నిర్వహించిన వృద్ధుల దినోత్సవంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోయిర్కర్‌తో కలిసి డీసీపీ మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌స్టేషన్ల వచ్చే వారు ఇబ్బంది ఎదురైతే డయల్ 112కు లేదా తనకు ఫోన్‌చేసి సమాచారం అందిస్తే సత్వరమే స్పందించామన్నారు. సెర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తి, డీ ఆర్డీవో కాళిందిని, జిల్లా వైద్యాధికారి పవిత్ర, కలెక్టరేట్ ఏవో ప్రకాశ్, సంక్షేమ శాఖ ఏవో రాజన్న, అధికారులుఅదనపు డీఆర్డీవో రవీందర్, ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్, రిటైర్డ్ డీపీవో వీరబుచ్చయ్య, రిటైర్డ్ బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
4న అథ్లెటిక్స్ పోటీలు
పెద్దపల్లి: సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఈనెల 4న బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గట్టయ్య తెలిపారు. ఇందులో ఎంపికై నవారు ఆసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లాలో ఈనెల 11 నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారన్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లో నవంబర్ 14 నుంచి 16వరకు నిర్వహించే జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకూ ఇక్కడే క్రీడాకారులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు తాండ్ర ప్రణయ్: 96183 36976 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
డిపోలో ఎన్నికల ప్రచారం
గోదావరిఖనిటౌన్: కాంగ్రెస్ అనుబంధ టీడబ్ల్యూయూ స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ఎన్నికల ప్రచారం నిర్వహించింది. జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, తమ యూనియన్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈనెల 9న జరిగే ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నాయకులు ముస్తాక్ మహీనుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నాయకులు కదారి అంజిరెడ్డి, వైఎస్ రెడ్డి, ఎం.అంజయ్య, కార్మికులు పాల్గొన్నారు.
సంఘటితంగా ఉండాలి
రామగుండం: ఉపాధ్యాయులు సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర కౌన్సిలర్ బయ్యపు సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పలు ప్రభుత్వ స్కూళ్లలో గురువారం జరిగిన డీటీఎఫ్ సభ్యత్వ నమోదు సందర్భంగా మాట్లాడారు. ఉపాధ్యాయులపై పనిఒత్తిడి తగ్గించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేసి పీఆర్సీని ప్రకటించాలని, బకాయిలను విడుదల చేయాలని, 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్, మండల అధ్యక్షుడు ఉమామహేశ్వర్, ప్రధాన కార్యదర్శి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


