పెద్దపల్లి: మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు రాజకీయ విలువలకు వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి అని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కొనియాడారు. సుల్తానాబాద్ చౌరస్తాలో గురువారం రాజమల్లు జయంతి నిర్వహించారు. కారోబార్ నుంచి సర్పంచ్, ఎంపీపీ, ఎమ్మెల్యేగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా రాజమల్లు అనేక పదవుల ద్వారా ప్రజాసేవ చేశారని విప్ అన్నారు. తాను రాజమల్లు ప్రియశిష్యుడినని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూకృషి చేయాలని కోరారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి చీరెలు అందజేశారు. కార్యక్రమంలో రాజమల్లు సతీమణి సుశీల, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, ప్రతినిధులు సారయ్యగౌడ్, ఉప్పు తిరుపతి, అబ్బయ్యగౌడ్, ప్రదీప్, గాజుల రాజమల్లు, శేఖర్, రవీందర్, నరేశ్, కల్లేపల్లి జానీ, ప్రకాశ్‌రావు, రాజేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రెడ్డి, దామోదర్‌రావు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
‘బిరుదు’ సేవలు చిరస్మరణీయం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: బీసీ నేత బిరుదు రాజమల్లు సేవలు చిరస్మరణీయమని మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మున్నూరు కాపుసంఘం జిల్లా అధ్యక్షు డు జడల సురేందర్, ఉప్పు రాజు, మున్సిపల్ మా జీ చైర్మన్ ఎల్.రాజయ్య అన్నారు. పెద్దపల్లిలో బిరు దు రాజమల్లుకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఎడెల్లి శంకర్, కొమ్ము సుధాకర్, కల్వల శంకర్, మస్రత్, అమిరిశెట్టి రామస్వామి, తోట శంకర్, సంపత్, తిరుపతి, ఓదెలు, రాంచందర్, తాళ్ల కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


