‘సోకు’లాడి.. చోరీచోరీ | - | Sakshi
Sakshi News home page

‘సోకు’లాడి.. చోరీచోరీ

Oct 2 2026 5:32 AM | Updated on Oct 2 2026 5:32 AM

పెద్దపల్లిరూరల్‌: దొంగతనం చేసేవారి అభిరుచులే వేరు.. కొందరు బంగారం కోసమైతే..ఇంకొందరు నగదు కోసం కక్కుర్తి పడి ఇళ్లకు కన్నాలు వేస్తారు. కానీ.. స్థానిక కమాన్‌రోడ్డులోని విషాల్‌ షాపింగ్‌మాల్‌లోకి గురువారం వచ్చిన కి ‘లేడీ’ కస్టమర్‌లా బిల్డప్‌ ఇస్తూ వచ్చి.. తనకు నచ్చిన డ్రెస్సులను ఎంపిక చేసుకుని ట్రయల్‌ కోసమని వెళ్లి లో దుస్తుల్లో దాచుకుని బయటకు వెళ్లేందుకు యత్నించింది. ఇంతలో నిర్వాహకులు అమర్చుకున్న అలారం మోగడంతో సోకులాడి పరుగు లంకించింది. అప్రమత్తమైన సిబ్బంది.. చోరీకి యత్నించిన యువతి వెనక పరుగుతీసింది. ఈ సన్నివేశాన్ని చూసిన స్థానికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడ్డారు. చివరకు యువతిని పట్టుకున్నా.. ఉద్యోగిని చేతిపై చరిచింది. మళ్లీ తనను పట్టుకునేందుకు యత్నిస్తే రోడ్డుపై వచ్చే వాహనం కిందపడి మరణిస్తానని బెదిరించింది. సదరు ఉద్యోగిని తేరుకునే లోపే బైక్‌పై వచ్చిన యువకుడితో కలిసి యువతి పరారైంది. ఇదేం దొంగతనం రా బాబోయ్‌.. అని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement