పెద్దపల్లిరూరల్: ప్రతీఒక్కరు తమవంతుగా నీటి వృథాను నియంత్రించడంతో పాటు భూగర్భజలాలు పెంచేలా ఏర్పాట్లు చేసుకుంటే జలసిరులను కాపాడుకోవచ్చని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాళిందిని అన్నారు. సోమవారం పెద్దపల్లిలో మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులకు జలసిరిపై అవగాహన కల్పించారు. పొలాలు, చేల వద్ద కుంటలు, ఇంటి ఆవరణలో ఇంకుడు, ఊట గుంతలు, బోర్‌వెల్ వద్ద రీచార్జ్ స్ట్రక్చర్స్ లాంటి నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో రమేశ్‌బాబు, ఏవో నాగార్జున తదితరులున్నారు.
నీటికుంట నిర్మాణ స్థ్థలం పరిశీలన
ధర్మారం: బొమ్మారెడ్డిపల్లి గ్రామంలో నీటికుంట నిర్మాణ స్థలాన్ని డీఆర్‌డీవో కళిందిని పరిశీలించారు. జలసరిలో భాగంగా రైతులు వ్యవసాయ పొలాల్లో నీటికుంటలు నిర్మించుకోవాలని సూచించారు. సర్పంచ్ రాజ్‌కుమార్, ఎంపీడీవో సుమలత, జూనియర్ ఇంజినీర్ మల్లయ్య, టెక్నికల్ అసిస్టెంట్ భూలక్ష్మి, పంచాయితీ కార్యదర్శి మానసరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ భాగ్య తదితరులు పాల్గొన్నారు.


