అన్ని విధాలా పెద్దపల్లి అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

అన్ని విధాలా పెద్దపల్లి అభివృద్ధి

Jul 28 2026 2:18 AM | Updated on Jul 28 2026 2:18 AM

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుదామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సోమవారం మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య అధ్యక్షతన జరిగిన పెద్దపల్లి మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. పట్టణం నుంచి వెలువడ్డ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు డంపింగ్‌యార్డులో ఎకరంన్నర స్థల కేటాయింపుపై తీర్మాణించారు. దీంతో పాటు 39 అంశాలతో కూడిన ఎజెండాను మున్సిపల్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని కమిషనర్‌ వెంకటేశ్‌ తెలిపారు.

కలాంకు నివాళి

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాంకు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు నివాళి అర్పించారు. మున్సిపల్‌ ఆఫీసులో కలాం చిత్రపటానికి పూలమాల వేసి కలాం సేవలను స్మరించుకున్నారు. దేశరక్షణ వ్యవస్థలో కీలక ఘట్టాలను ఆవిష్కరించిన మహానీయుడని, దేశ సేవకు అంకితమైన మహోన్నతుడని కొనియాడారు.

‘సర్‌’పై దృష్టి సారించాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన వారందరికీ ఓటరు జాబితాలో పేరుండేలా చూడాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. నిర్ణీత గడువులోగా ఓటర్ల నుంచి వివరాలను సేకరించి ఆన్‌లైన్‌ జరిగేలా చూడాలని అధికారులు, బిఎల్‌ఓలకు సూచించారు. వైస్‌చైర్మన్‌ మస్కాన్‌ నాజ్‌నయ్యర్‌అలీ, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు పరిశీలన

పెద్దపల్లి మెయిన్‌రోడ్డులో జరుగుతున్న విస్తరణ పనులను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణా రావు సోమవారం పరిశీలించారు. పనులు ఎలా సా గుతున్నాయని కమిషనర్‌ వెంకటేశ్‌ను అడిగి తెలు సుకున్నారు. మెయిన్‌రోడ్డులో ఉన్న వ్యాపారులంతా 55అడుగుల విస్తరణ పనులకు సహకరించాలన్నారు. కూల్చివేతల తర్వాత అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటుతో పట్టణానికి కొత్తశోభ తెస్తామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, కౌన్సిలర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement