గోదావరిఖని: సమస్యలతో వచ్చే బాధితులకు చట్టపరిధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్‌కిశోర్ ఝా అన్నారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాఽధితులు సమస్యలు విన్నవించారు. బాధితులతో మాట్లాడి ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోని అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులు ఎవరైనా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించి చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
‘సర్’ నమోదు పూర్తి చేయండి
యైటింక్లయిన్‌కాలనీ: ఎస్‌ఐఆర్ నమోదును త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. సోమవారం రామగుండం కార్పొరేషన్ 14, 15, 16, 17, 18, 19, 20 డివిజన్‌లలో నిర్వహిస్తున్న ఓటర్ మ్యాపింగ్‌ను పరిశీలించారు. ఎస్‌ఐఆర్ నమోదు శాతాన్ని బీఎల్వోలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఆయా డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జీలు బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపట్టాలి
రామగుండం/పాలకుర్తి: వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపట్టాలని జెడ్పీ సీఈవో నరేందర్ అన్నారు. సోమవారం రామగుండం, బసంత్‌నగర్‌లలో స్వశక్తి మహిళలకు జలసిరిపై అవగాహన కల్పించారు. ప్రతీ వర్షపు నీటిబొట్టును భూమిలో ఇంకే విధంగా జలసిరి కార్యక్రమం నిర్వహించాలని, ప్రతీగ్రామంలో రైతులను గుర్తించి వారికి జలసిరిపై అవగాహన కల్పించాలన్నారు. మండల సమైక్య అధ్యక్షురాళ్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏఈలు ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.
స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి
గోదావరిఖని: తాడిచర్ల్ల–2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి వివేక్ కోరారు. సోమవారం కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాడిచెర్ల–2 ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సింగరేణి సంస్థలో ఉద్యోగవిరమణ పొందిన కార్మికులకు కనీస నెలవారీ పెన్షన్ రూ.10వేలు ఉండేలా చూడాలని తెలిపారు. ప్రస్తుతం తక్కువ పెన్షన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది రిటైర్డ్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.
ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి
రామగుండంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చే యాలని కోరుతూ కేంద్రమంత్రి మాండవీయను సోమవారం ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ కలిసి విన్నవించారు. రూ.150 కోట్లతో రామగుండం ఈఎస్‌ఐ ఆస్పత్రి ప్రాజెక్టుకు ఆ మోదం లభించి, టెండర్ దశ వరకు వెళ్లినప్పటికీ, పనులు నిలిచిపోయాయని వివరించారు.


