నాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ, భర్త చనిపోగానే పెద్దకొడుకుకు ఉద్యోగం పెట్టించిన. చిన్న కొడుకుకు మూడు ఎకరాల భూమి ఇచ్చిన. ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పంచి ఇచ్చా. అన్నం పెట్టి పోషించమంటే ఇంకా బతుకుడు ఎందుకు చనిపొమ్మంటున్నారు. తనను పోషించేలా చూడాలి.
– గుజ్జేటి ఈశ్వరవ్వ, కమ్మర్‌ఖాన్‌పేట్, ధర్మారం మండలం
వారసులు ఉండగా కుటుంబ సభ్యుల పేర్లు లేకుండా ఫ్యామిలీమెంబర్ సర్టిఫికెట్ తీసుకొని ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దానికి చనిపోయిన కుమారుడి పిల్లల పేర్లు పెట్టకుండా తీసుకున్నారు. కరీంనగర్ ఆసుపత్రిలో చనిపోతే పెద్దపల్లి ఆస్పత్రిలో చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకొని ఫేక్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలి.
– మారోటి మారుతి మారయ్య, పెద్దపల్లి జెండా చౌరస్తా
రాజాపూర్ గ్రామంలో 2007లో అసైన్‌మెంట్ కమిటీ తీర్మానం ప్రకారం మాకు ఇచ్చిన ప్రభుత్వ భూమిలో ఒక్కొక్కరికి ఎకరం భూమిని పంపిణీ చేశారు. అసైన్డ్ భూమి హద్దులు చూపించి మా భూమి మాకు విప్పించేలా అధికారులు చొరవ తీసుకోవాలి. అక్రమం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. హద్దులు చూపిస్తే సాగు చేసుకుంటాం.
– మామిడి ఇందిర, లక్ష్మీ, స్వరూప, రాజాపూర్, కమాన్‌పూర్ మండలం


