చైన్‌స్నాచింగ్‌కు విఫలయత్నం | - | Sakshi
Sakshi News home page

చైన్‌స్నాచింగ్‌కు విఫలయత్నం

Jul 28 2026 2:12 AM | Updated on Jul 28 2026 2:12 AM

● మహిళ కేకలు వేయడంతో పరారైన ఆగంతకుడు

● మహిళ కేకలు వేయడంతో పరారైన ఆగంతకుడు

బోయినపల్లి(చొప్పదండి): కిరాణ స్టోర్‌లో ఉన్న మహిళ మెడలోంచి బంగారు చైన్‌ లాగేందుకు ఓ ఆగంతకుడు యత్నించగా.. మహిళ కేకలు వేయడంతో పరారయ్యాడు. వేములవాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో కొండం విజయ తన కిరాణ దుకాణంలో ఒంటరిగా ఉంది. మొదట హెల్మెట్‌ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి సిగరెట్‌ కొనుగోలు చేసి వెళ్లాడు. అనంతరం అదే వ్యక్తి మళ్లీ వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేయడంతో ఆగంతకుడు పరారయ్యాడు. బాధితురాలు కొండం విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement