గుండెపోటుతో బీఆర్‌ఎస్‌ నేత మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో బీఆర్‌ఎస్‌ నేత మృతి

Jun 3 2026 11:56 PM | Updated on Jun 3 2026 11:56 PM

ఫెర్టిలైజర్‌సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ 22వ డివిజన్‌ గౌతమిన గర్‌ చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు, కాంట్రాక్టర్‌ గోపు ఐలయ్య యాదవ్‌(70) గుండెపోటుతో కోల్‌కతాలో మృతి చెందారు. వ్యాపార పనుల నిమిత్తం కోల్‌క తాకు వెళ్లిన ఆయన.. మంగళవారం మ ధ్యాహ్నం హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. కు టుంబ సభ్యులు వెంటనే అక్కడి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపు ఐలయ్య యాదవ్‌ రామగుండం నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. ఆయనకు భార్య గోపు పద్మావతి, ముగ్గురు కుమార్తెలు రూప, రేఖ, రమ్య ఉన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు కౌశిక హరి, లత బుధవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement