సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం

Jun 3 2026 11:56 PM | Updated on Jun 3 2026 11:56 PM

● 4 నుంచి ఆందోళనలు ఉధృతం ● సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరావు

పెద్దపల్లి: మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరు చేస్తామని సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈనెల 4 నుంచి 15 వరకు కార్మికుల సంతకాలతో లేఖలు రాయాలని, 18, 19వ తేదీల్లో మున్సిపల్‌ కార్యాలయా ఎదుట నిరాహార దీక్ష చేపట్టాలని, 22న చలో కలెక్టరేట్‌ చేపట్టాలని, 29, 30వ తేదీల్లో మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంప్‌ ఆఫీసుల ఎదుట ధర్నా చేయాలని, అయినా, సమస్యలు పరిష్కారం కాకుంటే నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు ముత్యంరావు తెలిపారు. ఇందుకు ప్రభుత్వ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సావనపల్లి వెంకటస్వామి, నాయకులు సింగారపు గట్టయ్య, చిప్పకుర్తి చందు, బొంకూరి సాగర్‌, దూడపాక చుక్కమ్మ, బొంకూరు శంకర్‌, మంచినీళ్ల భారతి తదితరులు పాల్గొన్నారు.

వరి విత్తనాల పేర్ల ప్రకటన

Advertisement
 
Advertisement
Advertisement