పాలనపై సింగరేణి సీఎండీ పట్టు | - | Sakshi
Sakshi News home page

పాలనపై సింగరేణి సీఎండీ పట్టు

Jun 3 2026 11:56 PM | Updated on Jun 3 2026 11:56 PM

పాలనపై సింగరేణి సీఎండీ పట్టు ● బొగ్గు గనుల్లో ప్రక్షాళనకు శ్రీకారం ● పెద్దఎత్తున అధికారుల బదిలీలే కారణం

గోదావరిఖని: పాలనాపరంగా పట్టు సాధించేందుకు సింగరేణి సీఎండీ, ఐఏఎస్‌ అధికారి దృష్టి సారించారు. ఒకవైపు సంస్థ స్థితిగతులపై అధ్యయనం చేస్తూనే, మరోవైపు ఉద్యోగులతో నేరుగా భేటీ అవుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారుల ఆకస్మిక బదిలీతోనూ వారిపై పట్టు బిగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సంస్థ సీఎండీగా బాఽ ద్యతలు చేపట్టిన బుద్ధ ప్రకాశ్‌ జ్యోతి సంస్థపై పూర్తిస్థాయిలో పట్టుసాధించేందుకు అన్నిఏరియాల్లో పర్యటించి కార్మికులతో మమేకం అవుతున్నారు.

రామగుండంపై ప్రత్యేక దృష్టి..

రామగుండంలో ఇటీవల పర్యటనకు వచ్చిన క్ర మంలో ఆర్జీ–1 జీడీకే–11గనిలో కార్మికులతో నేరు గా సమావేశమయ్యారు. సంస్థ పరిస్థితులు, కార్మికులకు సంస్థ నుంచి కావాల్సిన అవసరాలు, ఉద్యోగులు చేయాల్సి పనివిధానంపై దిశానిర్దేశం చేశారు. అన్ని ఏరియాల్లో పర్యటించి గనులు, ఓసీల్లో ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ, సంక్షేమం తదితర అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్షించారు. రాబోయే రోజుల్లో సంస్థ ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగుల నుంచి అందాల్సి సహకారం గురించి చర్చించారు.

అధికారుల బదిలీలపై చర్చ

సింగరేణిలో తన మార్కు చూపించేందుకు సీఎండీ అధికారుల బదిలీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చాలాఏళ్లుగా ఒకేఏరియాలో పనిచేయడం, రిక్వెస్ట్‌ బదిలీలు, పదోన్నతి బదిలీలు ఎక్కువగా జరిగాయి. మైనింగ్‌, ఈఅండ్‌ఎం, హెల్త్‌, ఐఈడీ, పర్సనల్‌ విభాగంలో ఒకేసారి పెద్దఎత్తున బదిలీలు కావడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో మరికొంత మంది అధికారుల బదిలీలు కూడా ఉండచ్చొనే చర్చ సాగుతోంది. పాలనాపరంగా పట్టుబిగించేందుకు పెద్దఎత్తున బదిలీలు జరిగినట్లు చర్చ సాగుతోంది.

క్షేత్రస్థాయి పర్యటనతో మరింత లోతుగా

సీఎండీగా బాధ్యతలు స్వీకరించాక కొద్దిరోజులపాటు కార్యాలయంలో ఉంటూనే సంస్థ స్థితిగతులపై అధ్యయనం చేశారు. అన్ని ఏరియాల్లో పర్యటించి అధ్యయనం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు, సంక్షేమ కార్యక్రమాలపై దృషి సారిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత లోతుగా ముందుకెళ్లి ఉద్యోగులను కార్మోణుఖుల ను చేసి సంస్థను లాభాల బాటలో తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement