వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి

Jun 3 2026 11:56 PM | Updated on Jun 3 2026 11:56 PM

● రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి

కోల్‌సిటీ: స్వశక్తి మహిళలు వృత్తి నైపుణ్యం పెంపొందించుకొని తమ కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడేలా వ్యాపార కార్యకలాపాలు చేపట్టాలని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి కోరారు. ధనశ్రీ పట్టణ మహిళా సమాఖ్యలో భాగమైన ఎస్‌ఎల్‌ఎఫ్‌లకు కొత్తగా ఎన్నికై న అధ్యక్షులతో బుధవా రం బల్దియా కార్యాలయంలో సమావేశమయ్యారు. స్వశక్తి మహిళలకు ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీ లు, తక్కువ వడ్డీరేట్లతో రుణాలు ఇప్పించి వ్యాపార యూనిట్లు స్థాపించుకునేందుకు ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ సహకకారం అందిస్తున్నారని తెలిపా రు. పట్టణ ప్రాంత స్వశక్తి మహిళలతో సోలార్‌ ప్లాంట్లు, ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయించే యోచనలో ఉన్నారని వెల్లడించారు. ధనశ్రీ పట్టణ సమాఖ్య కార్యకలాపాలు ఆరేళ్లుగా స్తంభించిన నేపధ్యంలో పునరుద్ధరించేందుకు ఎస్‌ఎల్‌ఎఫ్‌లకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపా రు. త్వరలో పట్టణ సమాఖ్యకు కూడా కొత్త కార్యవ ర్గం ఎన్నుకోవాలని సూచించారు. కమిషనర్‌ అరుణ శ్రీ మాట్లాడారు. టీపీఎస్‌ నవీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు ఊర్మిళ, శ్వేత, ప్రియదర్శిని, శమంత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement