చెరువులను చెరబడుతున్నారు! | - | Sakshi
Sakshi News home page

చెరువులను చెరబడుతున్నారు!

Jun 3 2026 11:44 PM | Updated on Jun 3 2026 11:44 PM

● చెరువు మట్టి ద్వారా వచ్చే రాయల్టీ, సెస్‌ రూ పంలో సమకూరే ఆదాయం ఆయ గ్రామపంచాయతీల అభివద్ధికి వినియోగించాలనే అభిప్రా యం గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది. చెరువులు ఊరోళ్ల ఉమ్మడి వనరులు కావడంతో వాటినుంచి లభించే ఆదాయం నేరుగా రాష్ట్ర సినరేజీ ఖాతాలో జమచేయాలి. అక్కడి నుంచి గ్రామానికి 25శాతం, మండల పరిషత్‌కు 50శాతం, జిల్లా పరిషత్‌కు 25శాతం కేటాయిస్తారు. జిల్లాలో నేరుగా జిల్లాఖాతాలోకే చేరుతుండడం, వాటిని జిల్లాలో ఎక్కడైనా ఖర్చు చేసే అవకా శం ఉంటుంది. ఫలితంగా చెరువులతో కలిగే ప ర్యావరణ ప్రభావాలు, రహదారుల ధ్వంసం, దుమ్ము కాలుష్యం, గ్రామస్తులకు ఎదురయ్యే ఇబ్బందులు స్థానికంగానే ఉండగా, ఆర్థిక ప్రయోజనాలు తమ గ్రామాలకు చేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మట్టి తవ్వకం, రవాణాలో అక్రమాలు క్యూబిక్‌ మీటర్‌కు బదులు టిప్పర్‌ చొప్పున అనుమతి అధికలోడ్‌తో, రసీదు లేకుండా రవాణా దందా

భారీ టిప్పర్లతో రోడ్లు శిథిలం

సాక్షి పెద్దపల్లి:

జిల్లాలో ఇటుకబట్టీల అవసరాల కోసం చెరువుల నుంచి మట్టి తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ట్లు ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. చెరువుల్లోంచి మట్టి రవాణాపై కలెక్టర్‌ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినా అమలుకాకపోవడం గమనార్హం. జిల్లాలోని కొదురుపాక, ఇందుర్తి, ముత్తారం చెరువుల నుంచే మట్టి తవ్వకాలకు అనుమతులు జారీచేశారు. ప్రతీ వాహనానికి ఫొటోగ్రఫీ, రసీదు తప్పనిసరి చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మట్టి రవాణా చేయాలని సూచించారు. జిల్లాలోని పలు ప్రాంతా ల్లో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిపోతోందని గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు.

దందాకు ఊతం ఇలా..

నిబంధనల ప్రకారం చెరువు మట్టి తవ్వకానికి క్యూ బిక్‌ మీటర్‌ లెక్కన అనుమతి ఇవ్వాల్సిన అధికారులు.. టిప్పర్ల లెక్కన పర్మిషన్లు ఇస్తూ అక్రమాలకు బీజం వేశారు. అదికూడా ఎన్నిౖ టెర్ల వాహనం అనే ది స్పష్టత లేదు. మట్టి తరలించేది 12 లేదా 14 లేదా 16 టైర్ల లారీ కావచ్చు. ఈ లోపాన్ని అదనుగా తీసుకున్న అక్రమార్కులు.. వే బిల్లులు లేకుండానే ఓవర్‌లోడ్‌తో చెరువు మట్టి తవ్వుతూ, తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు.

‘చెరువు మట్టి గ్రామానిది.. ఆదాయం ఎవరికి?

మట్టి రవాణా కోసం 12 టైర్ల వరకు ఉన్న వాహనాలకే అనుమతి ఉన్నా.. కొన్నిప్రాంతాల్లో 16 టైర్ల టి ప్పర్లనూ వినియోగిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. వీటి రాకపోకలతో రోడ్లు దెబ్బతింటుండగా, దుమ్ము, ధూళి సమస్యలు పెరుగుతున్నాయి. రోడ్ల మరమ్మతుకు భారీగా ప్రజాధనం వెచ్చించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత

మట్టి అక్రమ రవాణా, చెరువుల పరిరక్షణ, గ్రామీణ రోడ్ల ధ్వంసం వంటి అంశాలపై పలు గ్రామాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. చెరువుల్లో మట్టి తీసినందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు తక్కువ ధరకు ఇటుకలు ఇస్తారని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చెబుతన్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలుకావడం లేదు. వ్యవసాయం, భూగర్భ జలాల పరిరక్షణకు కీలకమైన వనరులని, వాటిసహజ స్వరూపం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

చోద్యం చూస్తున్న యంత్రాంగం

జిల్లాలో విచ్చలవిడిగా, ఇష్టారీతిన మట్టి అక్రమ దందా కొనసాగుతున్నా రెవెన్యూ, మైనింగ్‌, నీటిపారుదల, ఆర్టీఏ, పోలీస్‌ విభాగాలు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనేక అను మానాలకు తావిస్తోంది. జిల్లాకు చెందిన ఓ కీలకప్రజాప్రతినిధి, మరోకీలక ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈ తతంగం కొనసాగుతోందని, అందుకే అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement