గోదావరిఖని: శాంతిభద్రతల పరిరక్షణలో బ్లూ కోల్ట్స్, పెట్రో సిబ్బంది పాత్ర అత్యంత కీలక మని రామగుండం కమిషనరేట్ అడిషనల్ డీ సీపీ(అడ్మిన్) శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్ లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిర్యాదుదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా, సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో సీఐ చంద్రశేఖర్‌గౌడ్, అనిల్‌కుమార్, బాబురావు, సిబ్బంది పాల్గొన్నారు.
క్రమశిక్షణే బీజేపీకి బలం
సుల్తానాబాద్‌రూరల్: బీజేపీ కార్యకర్తల క్రమశిక్షణే పార్టీకి బలమని ఆ పార్టీ ఎమ్మెల్సీ చిన్న మల్ అంజిరెడ్డి అన్నారు. నర్సయ్యపల్లిలోని విజయ గార్డెన్‌లో రెండురోజుల పాటు జరిగే జి ల్లాస్థాయి ప్రశిక్షణ శిబిరాన్ని జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డితో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యకర్తలు క్రమశిక్షణ, నిబ ద్ధతతో పనిచేయాలని సూచించారు. ఇన్‌చార్జి రాజమౌళిగౌడ్, ప్రశిక్షణ జిల్లా ఇన్‌చార్జి పరినీత, మాజీ ఎంపీ వెంకటేశ్‌నేత, జిల్లా ప్రశిక్షణ కన్వీ నర్ గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి, నాయకులు గోమాస శ్రీనివాస్, నల్ల మనోహర్‌రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు
గోదావరిఖనిటౌన్: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సు నడిపిస్తామని డీఎం నాగభూషణం తెలిపారు. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు గోదావరిఖని నుంచి బస్సు బయలు దేరుతుందని పేర్కొన్నారు. ఈయాత్రలో హంపీ, గోవా, గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి, ధర్మస్థల, కుక్కేసుబ్రహ్మణ్య, మంత్రాలయం పుణ్య క్షేత్రాల సందర్శన ఉంటుందన్నారు. సీటు రిజర్వేషన్, వివరాలకు 70135 04982, 73828 47596 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
ప్రీప్రైమరీ ఇన్ స్ట్రక్టర్ల నియామకం
పెద్దపల్లి: జిల్లాలోని 48 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అవసరమైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి ఆసక్తి, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో శారద తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన 10 నెలల గౌరవ వేతనం చెల్లిస్తారన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 9వతేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
మట్టి దందాపై చర్యలేవి?
పెద్దపల్లి: జిల్లాలో వివిధ చెరువుల నుంచి మట్టి తరలించే టిప్పర్లు ఓవర్‌లోడ్‌తో వెళ్లడంతో రహదారులు దెబ్బతింటున్నాయని, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యేదాసరి మనోహర్‌రెడ్డి ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం ఆయన ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ప్రకాశ్‌కు ఒక వినతిపత్రం అందజేశారు. అనంతరం దాసరి మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారుల అండతో సాగుతున్న మట్టి మాఫియా, ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట సాగుతున్న మిల్లర్ల దోపిడీని అరికట్టాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి అక్రమ దందాలు అడ్డగోలుగా సాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఠాకూర్ రఘువీర్‌సింగ్, ఉప్పు రాజ్‌కుమార్, గుణపతి, వంగల తిరుపతిరెడ్డి, మోహన్‌రావు, సందీప్‌రావు, కొయ్యడ సతీశ్‌గౌడ్, పెంచాల శ్రీధర్, వెన్నం రవీందర్, రాజ కొమురయ్య, దేవయ్య, మార్కు లక్ష్మణ్, సలేంద్ర రాములు యాదవ్, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, బైరెడ్డి రాంరెడ్డి, బాలసాని ఈశ్వర్‌గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


