కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి

Jun 3 2026 11:44 PM | Updated on Jun 3 2026 11:44 PM

● రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌

గోదావరిఖని: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నూతన కమిటీ నాయకులతో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన తొలిసారి సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్‌ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

రామగుండం నవీకరణ లక్ష్యం

రామగుండం: పట్టణ నవీకరణ తన ప్రధాన లక్ష్య మని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. పట్టణంలోని 25, 26, 27, 28వ డివిజన్‌కాలనీల్లో ఆయన పర్యటించారు. మేయర్‌ మహంకాళి స్వా మి, కమిషనర్‌ అరుణశ్రీ, కార్పొరేటర్లు సిరిశెట్టి సతీశ్‌, ఇసంపెల్లి అంజయ్య, డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, టీపీఎస్‌ నవీన్‌, ఏఈ తేజస్విని, శా నిటరీ జవాన్‌ తిరుపతి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్‌ తదితరులు ఉన్నారు. కా గా, ఈసాలతక్కళ్లపల్లిలో హార్టికల్చర్‌ అధికారులు నిర్వహించిన ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఉద్యానవన అధికారులు శ్యామ్‌ప్రసాద్‌, జ్యోతి, తిరుమల ఆయిల్‌కేన్‌ కంపెనీ సీఈవో కేషు కల్యాణ్‌, ఏఎంసీ చైర్మన్‌ గడ్డం తిరుపతి, సర్పంచ్‌ బండి శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ వొడ్నాల జ్యోతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement