నేరాల కట్టడిలో సీసీ కెమెరాలు కీలకం | - | Sakshi
Sakshi News home page

నేరాల కట్టడిలో సీసీ కెమెరాలు కీలకం

Jun 3 2026 11:44 PM | Updated on Jun 3 2026 11:44 PM

● ప్రభుత్వ విప్‌ విజయరమణారావు, రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

పెద్దపల్లిరూరల్‌: నేరాలను కట్టడి చేయడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. దాతల సహకారంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన 65 సీసీ కెమెరాలు, ప్రహరీ అభివృద్ధి పనులను రామగుండం పోలీస్‌ క మిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా, డీసీపీ రాంరెడ్డినాయక్‌తో కలిసి బుధవారం విప్‌ ప్రారంభించారు. సీసీ కె మెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటైన పట్టణాల్లో పెద్దపల్లి అగ్రస్థానంలో ఉందని సీపీ అన్నారు. కరీంనగర్‌ నగల దుకాణంలో చోరీకి వచ్చినవారు తొలుత పెద్దపల్లినే ఎంచుకున్నా.. ఇక్కడి పటిష్ట నిఘా వ్య వస్థను అంచనా వేసి తమ ప్రణాళిక మార్చుకున్నా రని తెలిపారు. పెద్దపల్లిలోని రూరల్‌, మహిళా, ట్రా ఫిక్‌, ఎలిగేడులోని పోలీస్‌స్టేషన్లకు సొంత భవనా లు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చామని చెప్పారు. పెద్దపల్లి ఏసీపీ కార్యాలయానికి సైతం భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లిలో చందపల్లి, రాంపల్లిరోడ్డులో నిర్మించిన డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్‌ పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన రిక్రియేషన్‌క్లబ్‌ ప్రధానకార్యదర్శి కొట్టె సదానందం, కౌన్సిలర్‌ రజనీకృష్ణమూర్తితోపాటు రంగు శ్రీనివాస్‌ను అభినందించి సత్కరించారు. అనంతరం పోలీసులకు హెల్మెట్లు అందజేశారు. ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, నరేశ్‌, శ్వేతతోపాటు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement