కిక్‌బాక్సింగ్‌లో గురువీర్‌సింగ్‌కు బంగారు పతకం | - | Sakshi
Sakshi News home page

కిక్‌బాక్సింగ్‌లో గురువీర్‌సింగ్‌కు బంగారు పతకం

Jun 3 2026 11:44 PM | Updated on Jun 3 2026 11:44 PM

పెద్దపల్లి: ఒడిశాలో నిర్వహించిన జూనియర్‌ నేషనల్‌ కిక్‌బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పెద్దపల్లి బీఎంఆర్‌ కరాటే, కిక్‌బాక్సింగ్‌ అకాడమీ విద్యార్థి గురువీర్‌సింగ్‌ బంగారు పతకం సాధించాడు. 51 కేజీల కె–1 ఫైట్‌ విభాగంలో పోటీపడి అద్భుత ప్రతిభ కనబర్చాడని కోచ్‌ కర్ర వెంకటేశ్‌ తెలిపారు. వాకోఇండియా కిక్‌బాక్సింగ్‌ ప్రెసిడెంట్‌ సంతోష్‌ అగర్వాల్‌, తెలంగాణ కిక్‌బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రామాంజనేయులు, జనరల్‌ సెక్రటరీ మహిపాల్‌, జిల్లా కార్యదర్శి కుమార్‌, బీఎంఆర్‌ అకాడమీ వ్యవస్థాపకుడు సంతోష్‌, కోచ్‌ వెంకటేశ్‌ తదితరులు గురువీర్‌సింగ్‌ను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement