విద్యారంగంలో పురోగతి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగంలో పురోగతి

Jun 2 2026 12:44 AM | Updated on Jun 2 2026 12:44 AM

విద్యారంగంలో పురోగతి

పుష్కరకాలంలో నెరవేరిన ఆకాంక్షలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్‌ జిల్లా విద్యారంగంలో మంచిస్థాయిలో ఉన్నప్పటికీ, ఉన్నత విద్య, వృత్తివిద్య, వైద్య విద్యలో అవకాశాలు పరిమితంగా ఉండేవి. ప్రభుత్వ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలే ఆధారంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ, జూనియర్‌ కాలేజీల కొరత స్పష్టంగా ఉండేది. స్వరాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, గురుకుల, రెసిడెన్షియల్‌, పాలిటెక్నిక్‌ కాలేజీలు విస్తరించాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ విద్యలో అభివృద్ధి జరిగింది.

కొత్తపల్లి– మనోహరాబాద్‌ రైల్వే లైన్‌కు రూ.2,821 కోట్లు మంజూరయ్యాయి. సిది పేట వరకు 75 కిలో మీటర్లు రైల్వేలైన్‌ పూర్తయి రైలు నడుస్తోంది.

మానేరు రివర్‌ ఫ్రంట్‌ మంజూరైంది. దీనికి రూ. 610 కోట్లు నిధులు కేటాయించారు. నదిపై 3 కిలో మీటర్ల మేర ఎంఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేసేందుకు కొంత మేర సైడ్‌వాల్స్‌ ఏర్పాటు చేశారు. మానేరు నదిపై తీగల వంతెనకు రూ. 224 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దేశంలోనే రెండో తీగల వంతెనగా కరీంనగర్‌కు ఐకాన్‌గా నిలిచింది.

స్మార్ట్‌ సిటీగా దేశంలోని వంద నగరాలతో పాటు కరీంనగర్‌ను అభివృద్ధి చేశారు. కేంద్రం రూ.845 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుతో నగరంలో రోడ్లు, డ్రెయినేజీలు, పార్కులు, కమాండ్‌కంట్రోల్‌ సెంటర్‌ వంటి సౌకర్యాలు మెరుగుపడ్డాయి.

కరీంనగర్‌కు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల మంజూరైంది. దీనికి రూ. 200 కోట్లు నిధులుమంజూరయ్యాయి.

మానేరు డ్యాం సమీపంలో ఐటీ టవర్‌ ఏ ర్పాటు చేశారు. దీనికి రూ. 25 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌ను పాత భవనంస్థానంలో అధునాతనంగా మార్చారు. దీనికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేశారు.

పరిపాలన సౌలభ్యం కోసం పాత భవనంస్థానంలో కొత్త కలెక్టరేట్‌ భవనం ఏర్పాటు చేశారు. దీనికి రూ.45 కోట్లు మంజూరుచేశారు. నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.

పెద్దపల్లి జిల్లాలో రూ.400 కోట్లతో రామగుండం మెడికల్‌ కాలేజీ, జిల్లా ఆసుపత్రి అప్‌గ్రేడ్‌, పెద్దపల్లి, మంథనిలో కొత్తగా మాతశిశుఆరోగ్య కేంద్రాలు, కొత్త కలెక్టరేట్‌, రామగుండం కమిషనరేట్‌, మహిళ, సైబర్‌ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి బస్‌డిపో, బైపాస్‌ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతి, పార్వతి బరాజ్‌లు, నంది పంపుహౌజ్‌, గాయిత్రీ పంపుహౌజ్‌, మిడ్‌మానేరులతో ఉమ్మడి జిల్లాలో సాగునీరుకు డోకాలేకుండా పోయింది.

వేములవాడలో సుమారు 166కోట్లతో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశారు. మూలవాగు బ్రిడ్జి నుంచి వేములవాడ దేవస్థానం వరకు రూ.45 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి. సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పరిశ్రమకు మద్దతుగా యారాన్‌ డిపో(నూలు) ఏర్పాటు, జిల్లాలో 11వేలకు పైగా పాత పవర్‌లూమ్‌లను ఆధునీకరించారు.

126చేనేత సహకార సంఘాలు, 1600 చిన్న పవర్‌లూమ్‌ యూనిట్లకు ప్రోత్సాహం, టెక్స్‌టైల్‌ పార్కు, గార్మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్ల ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయ పరిసరాల అభివృద్ధికి సుమారు రూ.76 కోట్లు, అన్నప్రసాద భవన నిర్మాణానికి రూ.35 కోట్లు పైగా నిధుల కేటాయించారు. వీటీడీఏ ఏర్పాటుతో వేములవాడ సరికొత్తగా రూపుదిద్దుకోనుంది.

జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు, పా రామెడికల్‌ విద్యా అవకాశాలు పెరిగాయి. నేషనల్‌ హైవే–563 విస్తరణ పనులు, రాళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తయ్యాయి.

బసంత్‌నగర్‌ ఎయిర్‌పోర్టు, రామగుండం–మణుగూర్‌ను కలిపే కోల్‌కారిడార్‌, ఈఎస్‌ఐ ఆసుపత్రి, పత్తిపాక రిజర్వాయర్‌, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తదితర దీర్ఘకాలిక ప్రాజెక్టులు స్వరాష్ట్రంలో సైతం నెరవేరకపోవడంపై ప్రజానీకం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement