న్యూస్‌రీల్
పెద్దపల్లి: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం జరిగే వేడుకలకు చేపట్టిన ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ముఖ్యఅతిథిగా హాజవువుతారన్నారు. ఉదయం 7.50 గంటలకే వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. అదనపు డీసీపీ రాంరెడ్డి, పౌర సరఫరాల అధికారులు శ్రీనాథ్, శ్రీకాంత్, ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, తహసీల్దార్ రాజయ్య పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. ఒకప్పుడు ఉన్నత విద్య, వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడిన ఈ ప్రాంతం నేడు విద్యా,వైద్య రంగాల్లో స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పరిమిత స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలుండగా, ప్రస్తుతం కొత్తజిల్లాల వారీగా ఆధునిక వైద్యసేవలు, మెడికల్ కాలేజీలు, మాతాశిశు ఆరోగ్యకేంద్రాలు, గురుకుల విద్యాసంస్థలు, కార్పొరేట్
ఇంజినీరింగ్ కాలేజీలు, డిజిటల్ విద్యావసతులు అందుబాటులోకి వచ్చాయి. నీటిపారుదల, సాగు రంగంలో వచ్చిన
కీలకమార్పులతో ప్రజలకు ఆర్థిక స్థిరత్వం కలిగి, తలసరి ఆదాయం మెరుగుపడింది. –సాక్షిప్రతినిధి, కరీంనగర్


