అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Jun 2 2026 12:44 AM | Updated on Jun 2 2026 12:44 AM

సుల్తానాబాద్‌రూరల్‌: అర్హులందరికీ త్వరలోనే రెండోదశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామ ని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు తెలిపా రు. భూపతిపూర్‌లో సోమవారం ఇందిరమ్మ గృహప్రవేశాలు చేయించారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతోపాటు గృహప్రవేశాలు చేయిస్తోందని అన్నారు. సర్పంచులు పోచంపల్లి పోచాలు, తిరుమల్‌రా వు, శ్రీరంగరావు, ఏఎంసీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, మాజీ ప్రజాప్రతినిధులు పులి వెంకటేశం, జానీ పాల్గొన్నారు.

పేదలకు సంక్షేమ ఫలాలు

పాలకుర్తి: అర్హులైన ప్రతీకుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నా మని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రా జ్‌ఠాకూర్‌ అన్నారు. సోమవారం పాలకురితోపాటు బసంత్‌నగర్‌, కొత్తపల్లి, రామారావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించి మాట్లాడా రు. సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

పోలీసులకు సేవా పతకాలు

పెద్దపల్లిరూరల్‌/జ్యోతినగర్‌: జిల్లాలోని పలువురు పోలీసులు, పోలీస్‌ అధికారులకు ప్రతిష్టాత్మక పో లీస్‌ సేవా పురస్కారాలు లభించాయి. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా పోలీస్‌ శాఖలో అందించిన సేవలకు గుర్తింపు గా ఈ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎన్టీపీసీలోని ఏఎస్సై తిరుపతికి ఉ త్తమ సేవా, మరో ఏఎస్‌ఐ బుచ్చినాయుడుకు సేవా పురస్కారం దక్కింది. కాగా, పెద్దపల్లి సీఐ కె.ప్రవీణ్‌కుమార్‌ పోలీసు సేవాపతకానికి ఎంపికయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు నేరాల నియంత్రణకు పాటుపడుతున్న సీఐని పోలీసు సేవాపతకానికి ఎంపిక చేశారు.

మొక్కలు నాటిన అధికారులు

పెద్దపల్లి: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా, తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ వారోత్సవాలను ఈనెల ఒకటినుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో మొక్కనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్‌ పరిపాలన అధికారి ప్రకాశ్‌, అటవీ అధికారులు సతీశ్‌ కుమార్‌, వినయ్‌ నాయక్‌, దేవదాస్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యూరియా ఉత్పత్తి

ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్‌, కెమికల్‌ లిమిటెడ్‌ కర్మాగారం మేలో 1,07,883.45 మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి చేసిందని యూనిట్‌ హెడ్‌ ఎస్‌కే జిందాల్‌ తెలిపారు. తె లంగాణతోపాటు ఆరు రాష్ట్రాలకు యూరి యా సరఫరా చేశామన్నారు. ఇందులో 64 శా తం తెలంగాణకు కేటాయించామన్నారు.

రవాణా శాఖలో బదిలీలు

పెద్దపల్లిరూరల్‌: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో బదిలీలు జరిగాయి. జిల్లా రవాణశాఖ అధికారి రంగారావును వరంగల్‌ డీటీవో బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారు లు.. పెద్దపల్లి జిల్లా అధికారిగా ఎవరినీ నియమించలేదు. ఎంవీఐలు మసూద్‌అలీని కొమురంభీం ఆసిఫాబాద్‌కు, శివస్వప్నను సిద్దిపేట జిల్లాకు బదిలీ చేశారు. డెప్యూటేషన్‌పై ములుగులో విధులను నిర్వర్తిస్తున్న బి.శ్రీనివాస్‌ను భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేసినట్టు ఆ ఉ త్తర్వుల్లో పేర్కొన్నారు. కరీంనగర్‌ డీటీవో కా ర్యాలయంలో పనిచేసే ఎంవీఐ రవికుమార్‌, మంచిర్యాలలో పనిచేసే రంజిత్‌కుమార్‌, చంద్ర కిశోర్‌రెడ్డిని పెద్దపల్లికి బదిలీ చేశారు. ఏఎంవీఐలుగా ఆదిలాబాద్‌ నుంచి రవీందర్‌, కొ మురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి రాజమ ల్లు పెద్దపల్లికి బదిలీపై వచ్చారు. పెద్దపల్లి ఏవో గా వ్యవహరించిన అరుణను కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు, అక్కడి అరుణబాయిని పెద్దపల్లికి బదిలీ చేశారు.

సింగరేణి పరిరక్షణ లక్ష్యం

గోదావరిఖని: సింగరేణి సంస్థ కోసం జూలై 7వ తేదీన సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహిస్తామని టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షుడు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. నగరంలో సోమవారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్యాల రాజిరె డ్డి, కోరుకంటి చందర్‌, కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, మాదాసు రామ్మూర్తి, నూనె కొమురయ్య, పర్లపెల్లి రవి, చెల్పూరి సతీశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement