జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి

Jun 2 2026 12:44 AM | Updated on Jun 2 2026 12:44 AM

● కలెక్టర్‌కు విన్నవించిన నాయకులు

పెద్దపల్లి: అర్హులైన వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే–ఐజే యూ నాయకులు కోరారు. కలెక్టరేట్‌లో సోమవా రం కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు వినతిపత్రం అందజేశా రు. యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర సంపత్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షుడు వంశీ, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్‌ మాట్లాడుతూ, సీఏ సర్టిఫికెట్‌తో సంబంధం లేకుండా అర్హులందరికీ అక్కిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేలా ప్ర భుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. టీకే శ్రీనివా స్‌, సామల హరికృష్ణ, వీరమల్ల విద్యాసాగర్‌రావు, ఆకుల రమేశ్‌, రాజు, నర్సయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement