ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో యూరియా బస్తాలు లోడ్ చేసేందుకు అవసరమైన ప్లాస్టిక్ బ్యాగుల కొరత ఏర్పడడంతో ఆదివారం గూడ్స్ రైలును అధికారులు వెనక్కి పంపించారు. కర్మాగారంలో 90శాతం వరకు యూరియా ఉత్పత్తి అవుతోంది. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో వర్షాకాలం పనులు ఊపందుకున్నాయి. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ, ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఖాళీ సంచుల కొరతతో యూరియా తరలించేందుకు కర్మాగారానికి చేరిన రేకు వెనుదిరిగే దుస్థితి నెలకొంది. ఒక రేకులో సుమారు 1,156 బస్తాల యూరియా తరలిస్తారు.
వెనుదిరిగిన యూరియా కోసం వచ్చిన గూడ్స్ రైలు


