వాసవీ మాత బోధనలు సమాజానికి ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

వాసవీ మాత బోధనలు సమాజానికి ఆదర్శం

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

పెద్దపల్లి: వాసవీ మాత బోధనలు సమాజానికి ఆదర్శమని కలెక్టరేట్‌ పరిపాలన అధికారి ప్రకాశ్‌ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో యువజన, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాసవీమాట జయంతి వేడుకల్లో వాసవీ మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేశ్‌, మైనారీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ నరేశ్‌, టి.కుమార్‌, నర్సయ్య, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు నలుమాచు ప్రభాకర్‌, కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు రమేశ్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచాల జ్యోతి, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు అనిల్‌, సురేశ్‌, వేణు, నవీన్‌, రాజేందర్‌, వెంకటరమణ, బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వీయ గణనకు

ముందుకు రండి

కోల్‌సిటీ: జనాభా లెక్కల్లో స్వీయ గణన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిఒక్కరూ తమ వివరాలు నమోదు చేసుకోవాలని రామగుండం నగర మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. ఆదివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సుబ్బరాజుతో కలిసి స్వీయ గణన ప్రక్రియను ప్రారంభించారు. రామగుండంలో నివసిస్తున్న వారందరూ తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ గణాంకాల ఆధారంగానే నిధుల కేటాయింపు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని తెలిపారు. జాయింట్‌ డైరెక్టర్‌ సుబ్బరాజు మాట్లాడుతూ సేకరించిన సమాచారం గోప్యంగా ఉంటుందని, ఏప్రిల్‌ 26నుంచి మే 10వరకు ఆన్‌లైన్‌లో స్వీయ గణన చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి కృషి

కమాన్‌పూర్‌: మండల కేంద్రంలోని శ్రీఆదివరహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో కృషి చేస్తానని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ముస్త్యాల దామోదర్‌ అన్నారు. ఆదివారం ఆలయ నూతన పాలకవర్గ సభ్యులు చాట్ల రాయమల్లు, తాళ్ల భాగ్యలక్ష్మి, పిల్లి రాజు, సాగి శ్రీనివాసరావు, తీగల రాజయ్య, తిమ్మరాజు గిరిజ, గాజుల శ్రీనివాస్‌, కుందారపు శంకర్‌, బొజ్జ సతీశ్‌, బూస శ్రీనివాస్‌, అనవేన శ్యామల, కొంతం శ్రీనివాస్‌, మల్యాల మల్లేష్‌లతో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు అన్వర్‌, సర్పంచ్‌ రంగు సత్యనారాయణగౌడ్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ భాస్కర్‌రావు, మల్యాల రాంచంద్రంగౌడ్‌, పిల్లి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

డబ్బులు ఇప్పించాలి

గోదావరిఖని: ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఉద్యోగ బాధితులకు డబ్బులు ఇప్పించేందుకు రామగుండం ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎరువుల కర్మాగారం ఉద్యోగ బాధితుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన మక్కాన్‌సింగ్‌ రెండున్నరేళ్లుగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దళారులను జైలుకు పంపించి బాధితులకు డబ్బులు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. బాధితులతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెట్రోలియంశాఖ అధికారులను కలుస్తామన్నారు. అయినా వినకపోతే గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట టెంట్‌ వేసి ఆందోళన చేపడుతామని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి జాహిద్‌పాషా, తస్లీమాభాను, పోలాడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు అయిత శివకుమార్‌, రవినాయక్‌, బొబ్బిలి సతీశ్‌, యువజన విభాగ అధికార ప్రతినిధి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement