గోదావరిఖని: హైదరాబాద్‌కు చెందిన సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన అవంతిక తెలంగాణ ప్రోమో రన్–2026 యువతలో ఉత్సాహాన్ని నింపింది. ఈ రన్‌లో 500 మందికి పైగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా మరో 100 మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు వారు 2కే, 5కే, 10కే పరుగు పూర్తి చేసి తమ లక్ష్యాన్ని సాధించారు.
5కే రన్‌లో ఏసీపీ
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న గోదావరిఖని ఏసీపీ రమేశ్ 5కే రన్ పూర్తి చేసి అందరికీ స్పూర్తిగా నిలిచారు. జూన్ 7న హైదరాబాద్‌లో జ రిగే ఫైనల్ రన్‌లో గోదావరిఖని నుంచి పాల్గొనే వారికి ప్రత్యేక ప్రోత్సాహకంగా నగదు బహుమతిని పోలీసు శాఖ తరఫున తాను వ్యక్తిగతంగా అందజేస్తానని ప్రకటించారు. గంజాయి, డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు బానిసగా మారుస్తున్న యువత రోజూ మైదానం బాటపట్టాలని సూచించారు.
నిత్య ఆరోగ్యం కోసం పరుగు: మేయర్
నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిఒక్కరికీ రన్ని ంగ్ ఎంతో అవసరమని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రన్‌లో పా ల్గొన్న వారికి మెడల్స్ అందజేసి అభినందించారు.
అలరించిన జుంబా డ్యాన్స్
సర్వేశ్ డ్యాన్స్ మాస్టర్ నేతృత్వంలో డ్యాన్సర్స్ చేసి న జుంబా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రన్‌కు ముందు, తర్వాత జరిగిన వార్మప్ సెషన్ అందరినీ అలరించింది. కార్యక్రమంలో సింగరేణి ఆ ర్జీ–2 ఎస్‌ఓటూ జీఎం రాముడు, సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అధ్యక్షుడు సోమా జగన్మోహన రెడ్డి, ఉపాధ్యక్షుడు మహేష్‌పటేల్, కోశాధికారి హరీశ్‌చంద్రరెడ్డి, ఈసీ సభ్యులు రవి, రాజు, సదాశయ ఫౌండేషన్ జాతీయ గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు కేఎస్ వాసు, చంద్రమౌళి, శంకర్, జబ్బర్ ఖాన్, సోమారపు అరుణ్ కుమార్, లావణ్య, వనజా రాపోలు, జ్యోతి, వెల్దీ కవిత అనంతరాములు పాల్గొన్నారు.


