ఎలిగేడు: సనాతన హిందూ ధర్మరక్షణకు ప్రతీ హిందువు నడుం బిగించాలని విష్ణుసేవానందగిరి స్వామి అన్నారు. ఆదివారం ఎలిగేడు మండల కేంద్రంలోని మధుర ఫంక్షన్‌హాల్‌లో జరిగిన హిందూ సమ్మేళనంలో మాట్లాడారు. హిందూ సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించి కాపాడాలని వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సంపర్క్ కుమ్మరికుంట సుధాకర్ మాట్లాడుతూ దేశంలో హిందువులు సంఘటితంగా ఉండటం అవసరమన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పాలని కోరారు. వీహెచ్‌పీ జిల్ల్లా మాతృశక్తి సంయోజక ఠాగూర్ తారాబా యి మాట్లాడుతూ పంచపరివర్తనతో కుటుంబంలో మార్పులు తీసుకరావాలన్నారు. ఈ సందర్భంగా ధూళికట్టకు చెందిన గాయత్రి పాఠశాల విద్యార్థుల సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు, భక్తి పాటలు, నృత్యాలు అలరించాయి. హిందూ సమ్మేళనం అధ్యక్షుడు కరివేద రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు భూసారపు నర్సయ్య, కోశాధికారి జనార్దన్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


