ఈతకొడుతుండగా నీటమునిగి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఈతకొడుతుండగా నీటమునిగి యువకుడి మృతి

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు

రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివారులోని చెరువుకట్ట సమీపంలో నివాసముండే బుడిగజంగాల కుటుంబానికి చెందిన పస్తం పవన్‌(18) శనివారం ఈతకొడుతుండగా పిట్స్‌ రావడంతో నీటమునిగి చనిపోయాడు. మరోఇద్దరు యువకులతో కలిసి చెరువులో ఈదుతుండగా పిట్స్‌ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. యువకుడు కొన్నేళ్లుగా పిట్స్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పస్తం రాంచందర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పవన్‌ ఉన్నాడు. రాంచందర్‌కు ఉన్న ఏకై క కుమారుడు పవన్‌ మృత్యువాత పడడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు.

జగిత్యాలక్రైం: బీర్‌పూర్‌ మండలకేంద్రంలో ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అదేగ్రామానికి చెందిన చీర్నేని బుచ్చన్నకు తీవ్రగాయాలయ్యాయి. బుచ్చన్న తన ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా.. జన్నారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బుచ్చన్న తలకు తీవ్రగాయాలుకాగా.. స్థానికులు 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బీర్‌పూర్‌ ఎస్సై రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్‌

జగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో, కిడ్నాప్‌, అత్యాచారం కేసులు నమోదు చేసి నింది తుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కరుణాకర్‌ తెలిపారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో ని వాసముంటున్న మనువాడ విష్ణువర్దన్‌ కొద్దిరోజు ల క్రితం పట్టణానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్‌ చే సి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యా దు మేరకు నిందితుడిని రిమాండ్‌కు పంపించినట్లు సీఐ తెలిపారు.

దాడి చేసిన వ్యక్తి రిమాండ్‌

చందుర్తి(వేములవాడ): పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని దాడిచేసిన చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన ఓ వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్సై జిల్లెల్ల రమేశ్‌ తెలిపారు. ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాలు. చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన గొంటి లక్ష్మణ్‌ రోడ్డుపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన నామాల ఉరఫ్‌ మ్యాదరి నర్సయ్య ఈనెల 5న గొడ్డలి కామతో దాడి చేశాడు. బాధితుడు లక్ష్మణ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

‘దేవి పుత్రిక’ అభినందనీయం

జిల్లా అదనపు, సెషన్స్‌ జడ్జి నీరజ

కరీంనగర్‌: ఆడపిల్ల పుడితే భారమనే వివక్షను వీడి, లక్ష్మీదేవిలా భావించినప్పుడే సమాజంలో లింగనిష్పత్తి తేడాలు తొలగిపోతాయని కరీంనగర్‌ జిల్లా అదనపు, సెషన్స్‌ జడ్జి నీరజ అన్నారు. కరీంనగర్‌ నగరంలో రోహన్‌ ఆసుపత్రి ప్రారంభించి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా శనివారం ‘దేవిపుత్రిక’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఆడపిల్ల పుడితే నార్మల్‌ డెలివరీ అయినా, సిజేరియన్‌ అయినా సంవత్సరం పాటు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అం దించేందుకు డాక్టర్లు ఎనమల్ల శ్రీదేవి, ఎనమల్ల నరేశ్‌ ముందుకొచ్చారు. శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీఎన్‌ రావుతో కలిసి ‘దేవిపుత్రిక’ పోస్టర్‌ ఆవిష్కరించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆడపిల్లల విషయంలో ఉన్న వివక్షను తొలగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement