ఉద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

పెద్దపల్లి: సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా మనస్తాపం చెంది నర్సంపేటలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగి కోలా శంకర్‌గౌడ్‌ చిత్రపటం వద్ద కలెక్టరేట్‌లో శనివారం ఉద్యోగ జేఏసీ నాయకులు నివాళి అర్పించాయి. అనంతరం మే 5న చేపట్టనున్న నిరాహార దీక్ష కోసం కలెక్టర్‌ కోయ శ్రీ హర్షను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొంకూరి శంకర్‌, తూము రవీందర్‌ పటేల్‌, లెంకల బ్రహ్మానందరెడ్డి, కరుణాకర్‌, సాజిద్‌ అలీ, రవీంద్రనాథ్‌, రవీందర్‌, బావ్‌సింగ్‌, రంగారెడ్డి, సురేశ్‌, అనిత తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సంబురాలు

గోదావరిఖనిటౌన్‌: ఆర్టీసీ డిపోలో కార్మికులు శనివారం సంబురాలు జరుపుకున్నారు. కార్మిక సంఘాల జేఏసీతో జరిగిన చర్చలు సఫలం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఖని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ వంగర శ్రీనివాస్‌, నాయకులు శామ్యూల్‌, తిరుపతి, కార్తీక్‌, నాగరాజు, కె.రాణి, బి.రాణి, శ్రీనివాస్‌, రాజేశ్‌, ఎంవీ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement