న్యామూర్తి పోస్టు ముళ్ల కిరీటం | - | Sakshi
Sakshi News home page

న్యామూర్తి పోస్టు ముళ్ల కిరీటం

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

వేములవాడ: జడ్జి పోస్టు ముళ్ల కిరీటంలాంటిదని, ఒక్కో రోజు కేసులు పూర్తిస్థాయి పరిష్కరించేందుకు రాత్రి అవుతుందని, కేసుల్లో బ్యాలెన్స్‌ చేయడంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుందని సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ జాదవ్‌ పేర్కొన్నారు. వేములవాడ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా మూడేళ్లపాటు విధులు నిర్వహించి ఖమ్మంకు బదిలీపై వెళ్తున్న జ్యోతిర్మయిని బార్‌ అసోసియేషన్‌ హాలులో శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్‌ జాదవ్‌ మాట్లాడుతూ ఎంతో మంది అభాగ్యులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తారని, ఈక్రమంలో తమపై ఎంతో బాధ్యత ఉంటుందన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిట్టల మనోహర్‌ మాట్లాడుతూ జడ్జిగా విధులు నిర్వహించిన సమయంలో జూనియర్లకు ఎంతో అవకాశం కల్పించారని, బార్‌ అండ్‌ బెంచ్‌ సత్సంబంధాలతో కొనసాగాయన్నారు.

మహిళలకు ఆదర్శం

వేములవాడ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే ఆగస్టు 16న వేములవాడ ప్రభుత్వాస్పత్రిలో నార్మల్‌ డెలివరీతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి సర్కార్‌ ఆస్పత్రులపై నమ్మకం పెంచారన్నారు. ఇలా మహిళలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏ ఆడపిల్లకై నా మొదటి డెలివరీ తల్లిగారింట్లో జరుగుతుందని.. అందుకే జడ్జి జ్యోతిర్మయికి వేములవాడ పుట్టినిల్లులాంటిదన్నారు. ఈక్రమంలో తమ సోదరికి వీడ్కోలు పలుకుతున్నట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ జాదవ్‌

జూనియర్‌ సివిల్‌ జడ్జి జ్యోతిర్మయికి వీడ్కోలు

కంటతడి పెట్టిన జడ్జి జ్యోతిర్మయి

కంటతడి పెట్టిన జడ్జి జ్యోతిర్మయి

అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని వేములవాడ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితులైన జ్యోతిర్మయి వేములవాడను తన పుట్టినిల్లుగా మార్చుకున్నారంటూ పలువురు అడ్వకేట్లు కొనియాడడంతో భావోద్వేగానికిలోనయ్యారు. జడ్జి జ్యోతిర్మయి మాట్లాడుతుండగా కంటతడి పెట్టుకున్నారు. బార్‌ అసోసియేషన్‌ హాలులో శనివారం జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆమె తన అనుభవాలను వివరిస్తూ వేములవాడను మరచిపోలేనని, తనను ఇంతగా ఆదరించిన వేములవాడ అడ్వేకేట్ల సేవలు గుర్తుండిపోతాయన్నారు. ఈక్రమంలో పలువురు అడ్వకేట్లు, కోర్టు సిబ్బంది సైతం భావోద్వేగానికి లోనయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement