కోల్‌సిటీ: చెత్త రహిత రామగుండం లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోందని, నగరం పూర్తిస్థాయిలో శుభ్రమయ్యేవరకూ విశ్రాంతి తీసుకోబోమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శుక్రవారం 36వ డివిజన్‌లోని గాంధీనగర్‌లో కార్పొరేటర్ కల్వల పద్మావతితో కలిసి ఆయన పర్యటించారు. నగరాభివృద్ధికి ప్రధాన అవరోధంగా మారిన చెత్తను పూర్తిగా తొలగిస్తామన్నారు. ఇరుకు వీధులతో చెత్త సేకరణకు ఆటోట్రాలీలు, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇళ్లఎదుట నిర్మించుకున్న గద్దెలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రంజిత్, మారెల్లి రాజిరెడ్డి, గడ్డం శ్రీనివాస్, విజయ్‌తోపాటు డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, డీఈలు అఫ్తాబ్, జగదీశ్, ఏఈలు అన్వేశ్, టీపీఎస్ నవీన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్, జవాన్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంక్ సాధించాలి
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రామగుండం ఉత్తమ ర్యాంక్ సాధించేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయా లని మేయర్ మహంకాళి స్వామి కోరారు. శానిటే షన్ డ్రైవర్లు, సిబ్బందితో బల్దియాలో ఆయన సమీక్షించారు. వేసవిలో జాగ్రత్తలు తీసుకుంటూ విధు లు నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. డ్రైవ ర్లు, డ్రైన్‌క్లీనర్లు, జవాన్లు చక్కగా పనిచేస్తూ నగరపాలక సంస్థకు రూ.లక్షల ఆదాయ ఆదా చేస్తున్నా రని కితాబిచ్చారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, ఈఈ రామన్, డీఈ శాంతిస్వరూప్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ శ్రీపాల్, జవాన్లు పాల్గొన్నారు.
అప్పటి వరకు విశ్రాంతి తీసుకునేదిలేదు
రామగుండం మేయర్ మహంకాళి స్వామి


